ఈపీఎఫ్ పై ఈసారి 8.25శాతం వడ్డీ

ఈపీఎఫ్ పై ఈసారి 8.25శాతం వడ్డీ

న్యూఢిల్లీ: 2024-–25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెండ్​ ఫండ్​ (ఈపీఎఫ్)పై 8.25 శాతం వడ్డీ ఇవ్వాలన్న ప్రపోజల్​ను ప్రభుత్వం ఆమోదించింది. దీంతో రిటైర్మెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్‌‌‌‌ఓ (ఈపీఎఫ్ఓ) తన ఏడు కోట్లకు పైగా చందాదారుల ఖాతాల్లో వార్షిక వడ్డీని జమ చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న, ఈపీఎఫ్‌‌‌‌ఓ 2024–-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని నిర్ణయించింది.

 ఇది గత ఆర్థిక సంవత్సరంలో అందించిన రేటుకు సమానం. 2024-–25 కోసం ఆమోదించిన వడ్డీ రేటు ఆమోదం కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపించారు. "కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2024-–25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ (ఈపీఎఫ్)పై 8.25 శాతం వడ్డీ రేటుకు ఆమోదం తెలిపింది. దీనిపై కార్మిక మంత్రిత్వ శాఖ గురువారం ఈపీఎఫ్‌‌‌‌ఓకి సమాచారాన్ని పంపింది" అని కార్మిక మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఢిల్లీలో కేంద్ర కార్మిక  ఉపాధి శాఖ మంత్రి మన్‌‌‌‌సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన ఈపీఎఫ్‌‌‌‌ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల 237వ సమావేశంలో వడ్డీరేటును ఖరారు చేశారు.