ENG vs IND: భారత టెస్ట్ కెప్టెన్‎గా శుభమన్ గిల్.. ఇంగ్లాండ్ టూర్‎కు టీమిండియా జట్టు ఇదే

ENG vs IND: భారత టెస్ట్ కెప్టెన్‎గా శుభమన్ గిల్.. ఇంగ్లాండ్ టూర్‎కు టీమిండియా జట్టు ఇదే

న్యూఢిల్లీ: రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరనే ఉత్కంఠకు బీసీసీఐ తెరదించింది. రోహిత్ శర్మ వారసుడిగా టీమిండియా యంగ్ బ్యాటర్ శుభమన్ గిల్‎ను ఎంపిక చేసింది. టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్‎గా శుభమన్ గిల్‎ పేరు బీసీసీఐ శనివారం (మే 24) అఫిషియల్‎గా అనౌన్స్ చేసింది. తద్వారా భారత 37వ టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టనున్నాడు. మరో యువ ఆటగాడు రిషబ్ పంత్‎కు టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్సీ పగ్గాలను అప్పగించింది బీసీసీఐ. టెస్ట్ కెప్టెన్సీ రేసులో గిల్, బుమ్రా, జడేజా, కేఎల్ రాహుల్ పేర్లు ప్రధానంగా వినిపించగా.. బీసీసీఐ గిల్ వైపు మొగ్గు చూపింది. 

వచ్చే నెల (జూన్)లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లబోయే భారత టెస్ట్ జట్టును బీసీసీఐ శనివారం (మే 24) ప్రకటించింది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును అనౌన్స్ చేసింది. టీమిండియా సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ 8 ఏళ్ల తర్వాత తిరిగి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత సీనియర్ బౌలర్ మహ్మద్ షమీని బీసీసీఐ పక్కన పెట్టింది. ఐపీఎల్ 18లో అదరగొడుతోన్న గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ టెస్ట్ జట్టులో స్థానం సంపాదించాడు. జట్టులో జడేజా, బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ మినహాయిస్తే మిగిలిన అందరూ యువ ఆటగాళ్లే కావడం గమనార్హం. 

 ఇంగ్లాండ్ టూర్‎కు వెళ్లే భారత టెస్ట్ జట్టు:

శుభ్‌మన్ గిల్ (సి), రిషబ్ పంత్ (WK & VC), యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శార్దూల్ సింగ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్