బీఆర్ఎస్కు షాక్.. రేవంత్ను కలిసిన బోధ్ ఎమ్మెల్యే

బీఆర్ఎస్కు షాక్.. రేవంత్ను కలిసిన బోధ్ ఎమ్మెల్యే

ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాకులమీద షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ లో అసంతృప్తులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.  లేటెస్ట్ గా బోధ్ ఎమ్మెల్యే  రాథోడ్  బాపూరావు   టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసారు. బోధ్ టికెట్ విషయంపై వీరిద్దరు చర్చించినట్లు తెలుస్తోంది.  త్వరలోనే బాపూరావు బీఆర్ఎస్  రాజీనామా చేసి  కాంగ్రెస్ లో చేరనున్నారు. 

ఇటీవల బీఆర్ఎస్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాలో బాపూరావుకు బోధ్ టికెట్ ఇవ్వలేదు కేసీఆర్. .బాపూరావును కాదని  నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్ జాదవ్ కు ఇచ్చారు.  అప్పటి నుంచి అంసతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే బాపూరావు బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో ఇవాళ ఆయన రేవంత్ రెడ్డిని కలిశారు.