కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే హరీష్ రావు

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే హరీష్ రావు

మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఉదయం కొండగట్టు ఆలయానికి చేరుకున్న ఆయన ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం ఆంజనేయ స్వామికి కట్టిన ముడుపును విప్పి దేవునికి చెల్లించారు.  అంతకుముందు ఆలయానికి చేరుకున్న హరీశ్‌రావుకు ఆలయ అర్చకులు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఆ తర్వాత వేదమంత్రాలతో హరీశ్‌రావును ఆశీర్వదించారు. హరీష్ రావు వెంట చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్, కొడిమ్యాల, మల్యాల మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు ఆలయానికి వెళ్లారు.