
- మోదీ మేనిఫెస్టోలో ఉచిత పథకాల జపం
హైదరాబాద్, వెలుగు: బీజేపీ మేనిఫెస్టో ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. మాటల గారడీ తప్ప, ప్రజలకు చేతల్లో చేసేదేమీ లేదని బీజేపీ మేనిఫెస్టో తేల్చిచెప్పిందన్నారు. రైతు రుణమాఫీ, జాతీయ ప్రాజెక్టులు, మధ్య తరగతికి ఆదాయ పన్ను రాయితీలు, కార్మికులు, చేతివృత్తుల వారికి పన్ను మినహాయింపు, యువతకు ఉద్యోగాల కల్పన, చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, 50 శాతం రిజర్వేషన్ పరిమితి పెంపు, హైదరాబాద్ సహా మెట్రో నగరాల అభివృద్ధి వంటి అంశాలేవీ ఆ మేనిఫెస్టోలో లేవని దుయ్యబట్టారు.
ఉచిత పథకాలపై బీజేపీ చెప్పిందేమిటి? చేసిందేమిటని ప్రశ్నించారు. పదేళ్లలో బీజేపీ చేసిందేమీ లేకపోవడంతో ఈసారి ఎన్నికల్లో గెలిపిస్తే ఉచిత పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చినట్లు హరీశ్‌రావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.