మరోసారి అవకాశం ఇవ్వండి : కందాల ఉపేందర్ రెడ్డి

మరోసారి అవకాశం ఇవ్వండి : కందాల ఉపేందర్ రెడ్డి

నేలకొండపల్లి , వెలుగు : పాలేరు ప్రజలకు ఏం కావాలో స్థానికుడిగా తనకు తెలుసని,  ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే  మరింత సేవ చేస్తానని ఎమ్మెల్యే, బీఆర్ఎస్  అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని అప్పల నర్సింహాపురం, కట్టుకాసారం, బుద్దారం, బైరవునిపల్లి, చెరువు మాదారం, తదితర గ్రామాల్లో  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంతో ముందుకు వెళ్తోందన్నారు. కేసీఆర్​కు మూడోసారి సీఎంగా అవకాశం ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్​ నాయకుల మాయమాటలు నమ్మవద్దన్నారు.

 గతంలో  ఎవరూ చేయని  అభివృద్ధి కార్యక్రమాలు  చేశానన్నారు. 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తు కు ఓటేసి తనను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం మండ్రాజుపల్లి గ్రామంలో జర్నలిస్టు తోళ్ల బుచ్చాలు అనారోగ్యంతో మృతి చెందడంతో  అక్కడకు వెళ్లి నివాళులర్పించారు. కార్యక్రమంలో  జడ్పీ చైర్ పర్సన్ ధనలక్ష్మి, ఏఎంసీ చైర్ పర్సన్ శాంత కుమారి,  యాతాకుల భాస్కర్,  జీవన్ కుమార్, బ్రహ్మయ్య,  శ్రీనివాసరావు,  నాగయ్య,  వాసు, అనిత, గురవయ్య, సైదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

బీఆర్ఎస్​లో పలువురు చేరిక

కూసుమంచి,వెలుగు:  కూసూమంచి మండలంలోని పాలేరు, తిరుమలాయపాలెం మండలంలోని కాకరవాయి గ్రామానికి చెందిన24 కుటుంబాలు, పాలేరులో పలువురు  ఎమ్మెల్యే ఉపేందర్​రెడ్డి సమక్షంలో సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్​ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే  గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్​ అద్దంకి ఉపేంద్రచారి, తదితరులు పాల్గొన్నారు.