హైదరాబాద్ లో కటౌట్ల కల్చర్ తెచ్చింది గోపీనాథే : కేటీఆర్

హైదరాబాద్ లో కటౌట్ల కల్చర్ తెచ్చింది గోపీనాథే : కేటీఆర్

శనివారం ( ఆగస్టు 30 ) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతికి సంతాపం తెలిపింది సభ. ఇవాళ ఉదయం 10 :30 నిమిషాలకు ప్రారంభమైన సమావేశాల్లో మాగంటి గోపినాథ్ మృతికి సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు సీఎం రేవంత్. 

ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో మాట్లాడుతూ గోపీనాథ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ అకాల మరణం తనకు బాధ కలిగించిందని అన్నారు. గోపీనాథ్ ఎన్టీఆర్ కు వీరాభిమాని అని.. హైదరాబాద్ లో కటౌట్ల కల్చర్ తెచ్చింది గోపీనాథే అని అన్నారు.

ఆయన చాలా సింపుల్ గా ఉండేవారని.. గోపీనాథ్ ఒక మాస్, డైనమిక్ లీడర్ అని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై గోపీనాథ్ చెరగని ముద్ర వేశారని అన్నారు. గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ప్రజలు ఒక మంచి నాయకుడిని కోల్పోయారని అన్నారు. గోపీనాథ్ మరణం ఆయన కుటుంబానికి తీరని లోటు అని అన్నారు కేటీఆర్.