LasyaNanditha:సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం వల్లే.. ఎమ్మెల్యే లాస్య చనిపోయిందా..?

LasyaNanditha:సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం వల్లే.. ఎమ్మెల్యే లాస్య చనిపోయిందా..?

హైదరాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో చనిపోవటం అందర్నీ షాక్ కు గురి చేసింది. హైదరాబాద్ నుంచి  సదాశివరావుపేట వెళ్తున్న సమయంలో.. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో ఎమ్మెల్యే చనిపోయారు. ప్రమాదం సమయంలో ఎమ్మెల్యే లాస్య.. డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్నారు. డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్, వెనక కూర్చున్న పీఏ వాళ్లిద్దరూ గాయాలతో బయటపడినా.. ముందు సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్య ఒక్కరే చనిపోవటానికి కారణం సీటు బెల్ట్ పెట్టుకోకపోవటమే అంటున్నారు పోలీసులు.

సీటు బెల్ట్ పెట్టుకున్న డ్రైవర్ గాయాలతో బయటపడినా.. ఆ పక్క సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే లాస్య.. సీటు బెల్ట్ పెట్టుకోలేదు. దీంతో ప్రమాదం జరిగిన తర్వాత భారీ కుదుపునకు గురవ్వటంతోపాటు.. ఎమ్మెల్యే లాస్య కూర్చున్న వైపు.. ఔటర్ రింగ్ రోడ్డు రైలింగ్ కు బలంగా ఢీకొన్నది కాదు. ప్రమాదం జరిగిన సమయంలో కారు వేగం 90 నుంచి 100 కిలోమీటర్లు ఉంటుందని భావిస్తున్నారు. అంత వేగంగా వెళ్లి.. రైలింగ్ ను ఢీకొనటంతో వల్లే ఎమ్మెల్యే లాస్య చనిపోయింది. 

ప్రమాదం సమయంలో సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే.. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి.. ప్రమాదం నుంచి బయటపడేవారనేది ఆస్పత్రి దగ్గర జరుగుతున్న చర్చ. సీటు బెల్ట్ పెట్టుకోకపోవటంతో ప్రమాదం జరిగిన సమయంలో.. ఎమ్మెల్యే తల.. కారు ముందు భాగంలోని డ్యాష్ బోర్డుకు బలంగా ఢీకొంది.. దీంతో తలకు తీవ్ర గాయం అయ్యింది. అంత పెద్ద ప్రమాదంతో షాక్ గురి కావటంతోపాటు.. తలకు గాయం అయ్యింది. సీటు బెల్ట్ పెట్టుకోకపోవటంతో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదు.. ఈ కారణంతోనే ఎమ్మెల్యే లాస్య కారు ప్రమాదంలో చనిపోయారనేది.. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ వారు చెబుతున్న మాట.. ఏదిఏమైనా సీటు బెల్ట్ ఒక కారణం అయితే.. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే లాస్యను వెంటాడుతున్న దురదృష్ట ఘటనలకు.. కారు ప్రమాదం మరోలా ముగింపు ఇచ్చింది అనేది అందరిలో జరుగుతున్న చర్చ ...