రేవంత్‌‌‌‌‌‌‌‌ ను సీఎం చేసింది నేనే...మేమిద్దరం అన్నా దమ్ములమే: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

రేవంత్‌‌‌‌‌‌‌‌ ను సీఎం చేసింది నేనే...మేమిద్దరం అన్నా దమ్ములమే: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

హైదరాబాద్​, వెలుగు: రేవంత్ రెడ్డిని సీఎంని చేసింది తానేనని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ తప్ప మరెవరూ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ నాయకుడు లేరని రెడ్డి సంఘం సమావేశంలో తానే చెప్పానని గుర్తుచేశారు. సోమవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్‌‌‌‌‌‌‌‌చాట్ చేశారు. ఎవరు అవునన్నా, కాదన్నా తాను, రేవంత్ అన్నదమ్ములమేనని చెప్పారు.

‘ఉస్తాద్ భగత్​సింగ్’ సినిమాలో విలన్ క్యారెక్టర్​తనదేనని, డైరెక్టర్​ హరీశ్ శంకర్ అడిగితే తాను ఒప్పుకోలేదని తెలిపారు. భవిష్యత్తులో సినిమాల్లో సీఎం పాత్ర చేయాలని ఉందని తెలిపారు. పక్కనే ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కల్పించుకుని, మల్లారెడ్డి విలన్ పాత్రకే బాగా సూట్ అవుతారని సరదాగా వ్యాఖ్యానించారు.