అవినీతి చేయకుంటే ప్రమాణానికి ఎందుకు రాలె?: కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డి

అవినీతి చేయకుంటే ప్రమాణానికి ఎందుకు రాలె?: కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎన్టీపీసీ నుంచి ఫ్లై యాష్‌‌‌‌‌‌‌‌ రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌‌‌‌‌‌‌రెడ్డి మరోసారి ఆరోపించారు. బుధవారం బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని టీటీడీ ఆలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. 

అవినీతికి పాల్పడకపోతే ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తాను సవాల్ చేశానని, ఆయన రాలేదు కాబట్టి అవినీతికి పాల్పడినట్టు స్పష్టమవుతోందన్నారు. అవినీతి చేయకపోతే ప్రమాణం చేయడానికి ఎందుకు రాలేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. ఫ్లై యాష్ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ వల్ల రోడ్లు దెబ్బ తింటున్నాయని చెప్పారు.