
తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించిన సంగతి తెలిసిందే.. బీఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చాయి. అపుడే జంపింగ్ లు షురూ అయ్యాయి. ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసారు. ఆయన వెంటన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారు. ఈయన త్వరలోనే కాంగ్రెస్ లో చేరునున్నారని తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక్కగానొక ఎమ్మెల్యే. ఈయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సన్నిహితుడు. కాంగ్రెస్ సీటు ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ లో చేరి గెలిచారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం ఆయన పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సీనియర్ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎందరు పార్టీ మారుతారో వేచి చూడాలి