
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్( Deshapathi Srinivas ), నవీన్ కుమార్( Naveen Kumar ), చల్లా వెంకట్రామిరెడ్డి( Challa Venkatrami reddy ) తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ లాబీల్లోని రిటర్నింగ్ ఆఫీసర్ కు సమర్పించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, తలసాని, మల్లారెడ్డి హాజరయ్యారు. అంతకుముందు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద అభ్యర్థులు నివాళులు అర్పించారు.
దేశపతి శ్రీనివాస్ :
సిద్దిపేట జిల్లాకు చెందిన దేశపతి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ప్రస్తుతం సీఎంవో కార్యలయం ఓఎస్డీగా వ్యవహరిస్తున్నారు.తెలంగాణ ప్రభుత్వం, తెలుగు భాషా ప్రచారంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు
చల్లా వెంకట్రామిరెడ్డి :
ఈయన భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి మనవడు (కూతురి కుమారుడు). ఆయన తన సొంత గ్రామమైన పుల్లూరు సర్పంచ్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, 2004లో అలంపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత వైఎస్సార్ పార్టీలో చేరి, అలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు గతేడాది డిసెంబర్ 9న బీఆర్ఎస్ లో చేరారు.
కుర్మయ్యగారి నవీన్ కుమార్ :
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న నవీన్ కుమార్ ... 2018లో తెలంగాణ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఏర్పడ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్ రావును కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన 2019 జూన్ 7లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.