వీడియో: రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కొన్న కవిత

వీడియో:  రోడ్డు పక్కన మొక్కజొన్న కంకులు కొన్న కవిత

రాజకీయాల్లో ఎప్పుడు బిజీగా ఉండే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రోడ్డున పక్కన కంకి కొంటూ కనిపించారు.  కంకులు అమ్మే వారితో కాసేపు మాట్లాడి వారి గురించి అడిగి తెలుసుకున్నారు.  ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

హైదరాబాద్ నుంచి జగిత్యాల వెళ్తున్న కవిత మార్గ మధ్యంలో నూకపల్లి దగ్గర కారు ఆపారు. రోడ్డు పక్కన కంకులు అమ్ముతున్న  ఓ మహిళ దగ్గరకు వెళ్లారు. నీ పేరేంటి, మీది  ఏ ఊరు, కంకి ఎంత, రోజుకు ఎన్ని కంకులు అమ్ముతావు, ఎంత లాభం వస్తుందని మహిళను అడిగి తెలుసుకున్నారు. చాలా మందిమి ఉన్నాం నీ దగ్గర ఉన్న కంకులు సరిపోతాయా అంటు మహిళను అడిగారు.   ఈ  విషయాన్ని కవిత తన ట్విట్టర్లో కూడా ప్రస్తావించారు. నర్సమ్మ  దగ్గర తియ్యటి మొక్క జొన్న కొన్నానంటూ గుర్తు చేసుకున్నారు.

జగిత్యాలలో ఇటీవల ‌అనారోగ్యంతో మరణించిన  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్‌ రమణ  తండ్రి ఎల్‌ గంగారం (ఎల్ జీ రాం) గారి చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ఎల్‌జీ రాం హెల్త్‌కేర్‌ సొసైటీ ద్వారా ఎల్ గంగారం గారు చాలా సేవలందించారని అన్నారు.