
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టింది. బంజారాహిల్స్ లోని తన ఇంటి దగ్గర కొత్త ఆఫీసును మే 31న సాయంత్రం 4గంటలకు ప్రారంభించింది. పూజాకార్యక్రమాలు చేసి తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించింది కవిత. ఆఫీసులోపల కేసీఆర్,కవిత, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలు తప్ప ఎవరీ ఫోటోలు కనిపిచండం లేదు. అలాగే తెలంగాణ జాగృతి పేరుతో ఏర్పాటు చేసిన బ్యానర్ లో కూడా కేసీఆర్, జయశంకర్ ఫోటోలు తప్ప మిగతా వారి ఫోటోలు ఎవరివీ లేవు.
గత కొన్ని రోజులుగా కేసీఆర్ కు లేఖతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కవిత కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడం తనకు ఇష్టం లేదని చెబుతున్న కవిత.. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని చేసిన కామెంట్స్ పెను సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న కవిత.. తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు చేస్తోంది. ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ఎవరి ఫోటో పెట్టడం లేదు. ఈ క్రమంలోనే కవితన సామాజిక తెలంగాణ లక్ష్యంగా కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరుతోంది.
మరో వైపు కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ ను జూన్ 5న విచారించనుంది. దీంతో జూన్ 4న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర భారత జాగృతి ఆధ్వర్యంలో నిరసన చేపట్టాలని ఆమె నిర్ణయించారు