ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసు..  సిట్ విచారణకు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు

తెలంగాణలో సంచలనం సృష్టించిన  ఫోన్ ట్యాపింగ్ కేసులో MLC నవీన్ రావును హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ విచారిస్తోంది. జూబ్లీహిల్స్ పీఎస్ లో ఆయనను అధికారులు విచారిస్తున్నారు. 

 ప్రత్యేక డివైజ్ లు ఉపయోగించి అప్పటి ప్రతి పక్ష నేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయించారని నవీన్ రావుపై ఆరోపణలు ఉన్నాయి.  పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో నవీన్ రావుకు అతి దగ్గర సంబంధాలున్నట్లు తెలుస్తోంది.  ఫోన్ ట్యాపింగ్ లో నవీన్ రావు గత SIB అధికారులను ఎలా ఉపయోగించుకున్నాడు అనేది ఆరా తీస్తుంది సిట్ టీమ్. ఎక్కడెక్కడ డివైజ్ లు ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డారనేదానిపై కూపీ లాగుతోంది సిట్. 

►ALSO READ | ఒక వీడియో బాగా వైరల్‌‌‌‌‌‌‌‌.. 3–4 నెలల్లోనే మిలియన్ వ్యూస్.. కూతురితో కలిసి సాధించింది !

SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఫోన్ టాపింగ్ కేసులో అరెస్ట్ అయిన మాజీ SIB అధికారులతో సంబంధాలపై నవీన్ రావును ప్రశ్నిస్తోంది.   ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసుల బాధితులైన పలువురు రాజకీయ నేతల స్టేట్ మెంట్ రికార్డు చేసిన సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి సారి నవీన్ రావు స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు  సిట్  అధికారులు. నవీన్ రావు స్టేట్ మెంట్ ఆధారంగా మరికొందరు బీఆర్ఎస్  ముఖ్య నేతలను విచారించే అవకాశం ఉంది.