ఒక వీడియో బాగా వైరల్‌‌‌‌‌‌‌‌.. 3–4 నెలల్లోనే మిలియన్ వ్యూస్.. కూతురితో కలిసి సాధించింది !

ఒక వీడియో బాగా వైరల్‌‌‌‌‌‌‌‌.. 3–4 నెలల్లోనే మిలియన్ వ్యూస్.. కూతురితో కలిసి సాధించింది !

చదువు పూర్తికాకముందే పెండ్లి జరిగింది. ఆ తర్వాత కుటుంబమే ఆమె ప్రపంచం అయ్యింది. కానీ.. గీతా గుర్జర్‌‌‌‌‌‌‌‌ తను ఒక సాధారణ గృహిణిలా మిగిలిపోకూడదు అనుకుంది. జీవితంలో ఏదైనా సాధించాలనే బలమైన కోరికతో సోషల్‌‌‌‌ మీడియాలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కూతురితో కలిసి వీడియోలు చేసింది. కష్టపడి ఎడిటింగ్‌‌‌‌ నేర్చుకుంది. ఇప్పుడు తన క్రియేటి విటీతో నాలుగు కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకుంది. ఇండియాలోని టాప్‌‌‌‌ సోషల్‌‌‌‌ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్ల లిస్ట్​లో స్థానం దక్కించుకుంది.

గీ తా గుర్జర్ ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని గ్రామీణ ప్రాంతంలో పుట్టింది. తన ట్విన్ సిస్టర్‌‌‌‌‌‌‌‌తో కలిసి పెరిగింది. నాన్న ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోనే ఆర్మీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేసేవాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఆడవాళ్లకు సరైన విద్య అందుబాటులో లేని టైంలోనే గీత ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఆ తర్వాత బీఈడీ చేయాలి అనుకుంది. కానీ.. తల్లిదండ్రులు పెండ్లి చేశారు. అయినా.. వెనకడుగు వేయకుండా అత్తగారింటి నుంచి కాలేజీకి వెళ్తూ బీఎడ్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసింది. కొన్నాళ్లు గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసింది. కానీ.. ప్రయోజనం లేకపోవడంతో తన దిశను మార్చుకుని సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో అడుగుపెట్టింది.  

వద్దన్నా వినకుండా..
గీత మొదటగా తన కూతురు అమైరా పేరుతో యూట్యూబ్ చానెల్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. అప్పుడు కుటుంబసభ్యులు అమైరా వీడియోలను సోషల్ మీడియాలో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేయడాన్ని వ్యతిరేకించారు. ఆమె భర్త మాత్రమే సపోర్ట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఆ చానెల్‌‌‌‌‌‌‌‌లో వీడియోలకు వ్యూస్ కూడా చాలా తక్కువగా వచ్చేవి. అప్పటివరకు గీతకు ఎడిటింగ్‌‌‌‌‌‌‌‌ చేయడం పెద్దగా తెలియదు. అందుకే సక్సెస్‌‌‌‌‌‌‌‌ కాలేకపోయింది.

దాంతో అనుభవం వచ్చాక 2021 జనవరి 26న ‘‘ది గీతా గుర్జర్” పేరుతో రెండో చానెల్‌‌‌‌‌‌‌‌ పెట్టింది. అందులో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్‌‌‌‌‌‌‌‌తో షార్ట్ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. కానీ.. ఈ చానెల్‌‌‌‌‌‌‌‌కు కూడా మొదట్లో పెద్దగా వ్యూస్‌‌‌‌‌‌‌‌ రాలేదు. అయినా రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వీడియోలు చేసేది. కొన్నాళ్లకు ఒక వీడియో బాగా వైరల్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. దానికి 3–4 నెలల్లోనే మిలియన్ వ్యూస్ వచ్చాయి. అప్పటినుంచి గీతకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.

రెండేండ్లలో..
గీత చానెల్‌‌‌‌‌‌‌‌ పెట్టిన మొదటి రెండేండ్లలో చానెల్‌‌‌‌‌‌‌‌ను 7 మిలియన్ల మంది సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. కానీ.. ఆ తర్వాత మూడేండ్లలో అంటే ఇప్పుడు ఆ సంఖ్య 40.3 మిలియన్లకు చేరింది. అంతేకాదు.. 2024 మొదటి మూడు నెలల్లో మోస్ట్ వ్యూడ్ ఇండియన్‌‌‌‌‌‌‌‌ యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ చానెల్స్‌‌‌‌‌‌‌‌లో 3వ స్థానం సాధించింది. ప్రస్తుతం నెలకు దాదాపు 530 మిలియన్ వ్యూస్‌‌‌‌‌‌‌‌ వస్తున్నాయి. దాంతో గీత బ్రాండ్ కొలాబరేషన్లు, ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ప్రతి నెలా లక్షల్లో సంపాదిస్తోంది.

గీత చేసే కంటెంట్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువగా ఫ్యామిలీ వ్లాగ్స్​, బ్యూటీ టిప్స్, కామెడీ స్కిట్స్, ట్రావెల్, ట్రెండింగ్ టాపిక్‌‌‌‌‌‌‌‌లే ఉంటాయి. అందుకే వీడియోలు అన్ని వర్గాల వాళ్లను ఆకట్టుకుంటున్నాయి. చానెల్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం బిలియన్ వ్యూస్‌‌‌‌‌‌‌‌ దాటిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇక వంద మిలియన్ల వ్యూస్‌‌‌‌‌‌‌‌ సాధించిన వీడియోలైతే బోలెడు ఉన్నాయి. ఇప్పటివరకు చానెల్‌‌‌‌‌‌‌‌లో 3,700 వీడియోలు అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఆమెకు ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో కూడా లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌ పేజీని నాలుగు లక్షలమందికి పైగా ఫాలో అవుతున్నారు.

ఎన్నో సవాళ్లు
చానెల్‌‌‌‌‌‌‌‌ పెట్టిన తొలి రోజుల్లో గీత ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఎడిటింగ్‌‌‌‌‌‌‌‌ నేర్చుకోవడానికి చాలా ఇబ్బంది పడింది. మొదట్లో వీడియోలు చేయడంలో ఏవైనా తప్పులు దొర్లితే సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియాలో ట్రోలింగ్ చేస్తారనే భయం ఉండేది. అందుకే రోజుకు 12 గంటలపాటు కష్టపడి షూటింగ్‌‌‌‌‌‌‌‌, ఎడిటింగ్ చేసేది.