హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

పార్లమెంట్ ఉభయసభల్లో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం నోటీసులిచ్చింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు వ్యతిరేకంగా వెల్లడైన హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని రాజ్యసభ, లోక్ సభల్లో బీఆర్ఎస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. హిండెన్ బర్గ్ నివేదిక భారతీయ ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెస్తుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత , ఎంపీ కె కేశవరావు పేర్కొన్నారు. అటు లోక్ సభలో హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాలని బీఆర్ఎస్ లోక సభ పక్ష నేత,ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇతర బిజినెస్ లను వాయిదా వేస్తూ తక్షణ చర్చకు అనుమతివ్వాలని  వాయిదా తీర్మానంలో కోరారు.