
అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరుతుండడంతో ఆ పార్టీ భవిష్యత్ పై కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. మరోవైపు, బీఆర్ఎస్ త్వరలో ఖాళీ కాబోతుందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పదే పదే అంటుండంతో అసంతృప్తి నేతలను బుజ్జగించే పనిలో బీఆర్ఎస్ అగ్ర నేతలు పడ్డారు.
లోక్ సభ ఎన్నికల కంటే ముందు జరగబోయే మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను బీఆర్ఎస్ ఎదుర్కొవాల్సి ఉంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సోమవారం గోవాలో రాజకీయ క్యాంపు పెట్టింది బీఆర్ఎస్. ఈ క్యాంపులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఆర్.ఎస్ ప్రవీణ్, పలువురు ఎంపీటీసీలు, జడ్పీటీలుతదితరులు పాల్గొన్నారు.
కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈనెల 28వ తేదీన పోలింగ్‌జరగనుంది. ఏప్రిల్ 2న రిజల్ట్ ను ప్రకటించారు.