
హైదరాబాద్, వెలుగు : ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ లీడర్లు మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలతో కూడిన బుక్లెట్ను బుధవారం తెలంగాణ భవన్లో రిలీజ్ చేశారు.
కాంగ్రెస్ లీడర్లకు వారి హామీలను గుర్తు చేసేందుకే బుక్లెట్ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ.. 420 హామీల గురించి కాంగ్రెస్ను ప్రశ్నించాలని కోరారు. వాటి అమలు కోసం తాము కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు.