కేక్ ముందు కూర్చొని కంటతడి పెట్టిన ఎమ్మెల్యే రాజయ్య

కేక్ ముందు కూర్చొని కంటతడి పెట్టిన ఎమ్మెల్యే రాజయ్య

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య గుక్క పట్టి ఏడ్చారు. రాజకీయంగా ఎదుర్కోలేక తనపై  లైంగిక ఆరోపణలు చేశారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కరుణాపురంలో ఫాదర్ కొలంబో 96వ జయంతి సందర్భంగా వేడుకలకు హాజరయ్యారు రాజయ్య. కేక్  ముందు కూర్చొని  కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు దిగజారి రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవెరెన్ని కుట్రలు చేసినా స్టేషన్ ఘన్ పూర్ లో భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 

ఇటీవల తనను ఎమ్మెల్యే రాజయ్య  లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళా సర్పంచ్ ఆరోపణలు చేశారు. దీనిపై  పెద్ద ఎత్తును విమర్శలు రావడంతో ఎమ్మెల్యే రాజయ్య  ఆ సర్పంచ్ ఇంటికెళ్లి ఆమెకు క్షమాపణలు చెప్పారు.