
- సాక్ష్యం చెప్పేందుకు రావాలని సీఈవోకు సిట్ నోటీసులు
పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన అక్రమాలు, తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రముఖ మీడియా సంస్థ ‘వీ6-వెలుగు’ ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చింది. దీంతో కక్ష కట్టిన నాటి సర్కార్ ‘వీ6-వెలుగు’కు ప్రకటనలు నిలిపివేయడంతో పాటు ఎన్నికల ముందు సంస్థ సీఈవో, చీఫ్ ఎడిటర్ అంకం రవి, ఇతర సీనియర్ ఉద్యోగుల ఫోన్లనూ ప్రభాకర్‌రావు టీమ్ ద్వారా ట్యాప్ చేసింది. ఈ మేరకు సీఈ వో, చీఫ్ ఎడిటర్ అంకం రవికి సిట్ సమాచారం ఇచ్చింది. సాక్ష్యం చెప్పేందుకు రావాలని నోటీసు లు జారీ చేసింది.
మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వీరి కుటుంబ సభ్యులు సహా మొత్తం 30 మంది కార్యకర్తల ఫోన్లు ట్యాప్ అయినట్లు తాజాగా గుర్తించి న సిట్.. వారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం పొంగులేటికి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సిట్ అధికారులు కాల్ చేసి, సాక్షులుగా హాజరుకావాలని కోరారు.