బీఆర్ఎస్ ది రాజకీయ డ్రామా

బీఆర్ఎస్ ది రాజకీయ డ్రామా
  • కేటీఆర్, హరీశ్ పోటాపోటీ

  • టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్హైదరాబాద్: బీఆర్ఎస్ ది రాజకీయ డ్రామా అని, అందుకే  కేటీఆర్, హరీశ్ పోటాపోటీగా మాట్లాడుతున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. గాంధీ భవన్ లో ఏర్పాటుచేసిన ప్రెస్​మీట్ లో ఆయన మాట్లాడుతూ ‘కేటీఆర్ కొత్త డ్రామా స్టార్ట్  చేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకు ఎల్లుండి మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నరు. ఎల్ఆర్ఎస్ కి దరఖాస్తు రుసుం తీసుకోవద్దంటూ హరీశ్ రావు సలహాలు ఇస్తున్నరు. మరీ.. గత బీఆర్ఎస్​ప్రభుత్వంలో మీరెందుకు తీసుకున్నట్టు?  మేడిగడ్డకి కాంగ్రెస్ వాళ్లు కూడా రావాలంటున్న బీఆర్ఎస్.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీల ఎమ్మెల్యేలను అక్కడకు తీసుకెళ్లినప్పుడు మీరెందుకు రాలేదు’ అని నిరంజన్​ప్రశ్నించారు.