- సీఎంకు బీఆర్ఎస్ఎల్పీ లేఖ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో రాష్ట్రం అవినీతి, కుంభకోణాలకు కేంద్రంగా మారిందని బీఆర్ఎస్ఎల్పీ ఆరోపించింది. వీటిలో మంత్రులు, కాంగ్రెస్ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉంటోందని పేర్కొంది. స్కామ్లపై సిట్టింగ్‌జడ్జి లేదా హౌస్‌కమిటీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మల్యేలు లేఖ రాసి, ఆదివారం స్పీకర్ ప్రసాద్‌కుమార్‌కు అందజేశారు. దాదాపు అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం జరుగుతున్నాయని, ఫలితంగా రూ.వేల కోట్ల ప్రజా ధనం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోతోందని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారిపోయాయని అన్నారు. మాటల్లో నీతి వాక్యాలు.. చేతల్లో దోపిడీ.. ఇదే కాంగ్రెస్పాలనకు ప్రతీక అని ఎద్దేవా చేశారు. అన్ని స్కామ్లపై విచారణ పారదర్శకంగా జరగాలంటే మంత్రులు వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
