ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకర్త

ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకర్త
  • అదుపులోకి తీసుకున్న ఎన్నికల మానిటరింగ్ టీమ్

కంటోన్మెంట్, వెలుగు: ఓటర్లకు డబ్బులు పంచుతూ ఓ బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకర్త ఎన్నికల మానిటరింగ్ టీమ్​కు దొరికిన ఘటన బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం బోయిన్​పల్లి పరిధిలోని తాడ్​బండ్ హనుమాన్ టెంపుల్ సమీపంలో కొందరు వ్యక్తులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు కంటోన్మెంట్ సెగ్మెంట్ ఎన్నికల మానిటరింగ్ టీమ్ కు సమాచారం అందింది.

నిఖిలేశ్​ ఆధ్వర్యంలోని ఎన్నికల మానిటరింగ్ టీమ్ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్న న్యూబోయిన్ పల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఎం. భాస్కర్​రెడ్డిని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అతడి నుంచి రూ.55 వేల 900 క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్ రెడ్డిని బోయిన్​పల్లి పోలీసులకు అప్పగించారు. అతడిపై 171 బీ, 171ఈ, 188 ఐపీసీ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోయిన్ పల్లి ఎస్సై నాగేంద్రబాబు తెలిపారు.