కోచింగ్ సెంటర్ల కుట్రతోనే గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్‌‌‌‌ : గెల్లు శ్రీనివాస్ యాదవ్

కోచింగ్ సెంటర్ల కుట్రతోనే  గ్రూప్ 1 కొత్త నోటిఫికేషన్‌‌‌‌ : గెల్లు శ్రీనివాస్ యాదవ్

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ వన్ పాత నోటిఫికేషన్‌‌‌‌ను రద్దు చేసి, కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక కోచింగ్ కేంద్రాల మాఫియా ఉందని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్వీ ప్రెసిడెంట్‌‌‌‌ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం, మళ్లీ ఎగ్జామ్ నిర్వహించడం వల్ల స్టూడెంట్స్ మళ్లీ కోచింగ్‌‌‌‌కు వెళ్లక తప్పనిసరి పరిస్థితి నెలకొంటుం దన్నారు.

ఇది నిరుద్యోగులకు ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని, కోచింగ్ సెంటర్లకు లబ్ధి చేకూరుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త నోటిఫికేషన్లను పక్కన బెట్టి, పాత నోటిఫికేషన్లనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. బిస్వాల్ కమిటీ నివేదిక బయట పెట్టాలని గెల్లు శ్రీనివాస్ యాదవ్ కోరారు. టీజేఎస్‌‌‌‌ నేత కోదండరాం రెడ్డి జాబ్ క్యాలెండర్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.

నిరుద్యోగులకు తోడుంటానని మాట్లాడిన బల్మూరి వెంకట్, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ రాగానే గొంతు ముగబోయిందా అని ప్రశ్నించారు.