బ్రషింగ్​ టైం: ఎంత సేపు బ్రష్​ చేయాలో తెలుసా..?

బ్రషింగ్​ టైం:  ఎంత సేపు బ్రష్​ చేయాలో తెలుసా..?

పళ్లు, నోరు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి రెండు సార్లు బ్రష్​ చేసుకోవాలి అంటారు డెంటిస్టులు.  అయితే, ఎంత సేపు బ్రష్​ చేయాలి? అనే కన్ఫ్యూజన్​ చాలామందికి ఉంటుంది. ఒక నిమిషం బ్రష్​ చేస్తే చాలని కొందరు, రెండు నిమిషాలు బ్రష్​ చేసుకుంటే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయని మరికొందరు అనుకుంటారు. పళ్లు, చిగుళ్లు హెల్దీగా ఉండాలంటే మూడు నాలుగు నిమిషాలు బ్రష్​ చేయాలని ఈ మధ్య వచ్చిన రీసెర్చ్​ రిపోర్టులు కొన్ని చెబుతున్నాయి.  
రెండు సార్లు ఎందుకంటే
పళ్లు తోముకున్న కొన్ని గంటల్లోనే నోట్లో బ్యాక్టీరియా పెరగడం మొదలౌతుంది. అందుకే రోజుకు రెండు సార్లు బ్రష్​ చేసుకోవాలి. పంటి ఆరోగ్యానికి వస్తే.... రోజుకి ఎన్నిసార్లు  పళ్లు తోముతున్నారు? బ్రష్​ చేసే తీరు? ఎలాంటి బ్రష్​ వాడుతున్నారు? అనేవి చాలా ఇంపార్టెంట్. పళ్ల చుట్టూ బ్యాక్టీరియా, ఫంగస్​, వైరస్​లతో కూడిన పాచి ఉంటుంది. రెండు నిమిషాలు బ్రష్​ చేసినా  పళ్ల మీది పాచి పోతుంది. అయితే మూడు నాలుగు నిమిషాలు పళ్లు తోమితే పళ్ల సందుల్లో ఉన్న పాచి కూడా పోతుందని, నోరు శుభ్రమవుతుందని రీసెర్చర్లు అంటున్నారు.