అర్ధరాత్రి ఇంట్లో చొరబడి..ఉపాధ్యాయుడి దారుణ హత్య

అర్ధరాత్రి ఇంట్లో చొరబడి..ఉపాధ్యాయుడి దారుణ హత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. దుమ్ముగూడెం మండలంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కొంతుకోసి హతామార్చారు. లచ్చి గూడెం గ్రామానికి చెందిన కారం రామకృష్ణ దుమ్ముగూడెం ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అర్ధరాత్రి బాధితుడు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి చొరబడ్డ  దుండగులు రామకృష్ణ  గొంతుకోసి హత్య చేశారు. అడ్డొచ్చిన భార్య తులసిపై దాడిచేసి అక్కడి నుంచి పరారయ్యారు.బాధితురాలి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా  భూవివాదం వల్లే  తన భర్త ను హత్య చేసినట్లు భార్య తులసి అనుమానం వ్యక్తం చేస్తోంది.