
హైదరాబాద్‌లో సినీ ఫక్కీలో ఒక యువకుడిని ప్రత్యర్థులు వెంటాడి అతి దారుణంగా నడిరోడ్డుపై హత్య చేశారు. ఈ సంఘటన మైలర్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ మండల పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలోని అన్సారీ రోడ్డులో షేక్ జావిద్ (32) అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో జావిద్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి తర్వాత స్థానికులు జావిద్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న మైలర్‌దేవ్‌పల్లి పోలీసులు.. క్లూస్ టీంను రంగంలోకి దింపి వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసును పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.
For More News..
హయ్యస్ట్ రికార్డ్.. దేశంలో తొలిసారిగా 86 వేలకు పైగా కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 2,511 కరోనా కేసులు.. 11 మంది మృతి
యాదాద్రి నరసింహుడికి బంగారు తలుపు