
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన నాలుగో టెస్టులో సంచలన విషయాలు వెలువడ్డాయి. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడాన్ కార్స్ పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదర్కొంటున్నాడు. నాలుగో రోజు ఆటలో భాగంగా టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ ఇంగ్లాండ్ పేసర్ కార్స్ బౌలింగ్ లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన కార్స్ తన షూ స్పైక్‌లతో బంతిని బలంగా తొక్కాడు. ఇంగ్లాండ్ పేసర్ చేసిన ఈ పని అనుమానాస్పదంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ లైవ్ కామెంట్రీ చేస్తూ కార్స్ ప్రవర్తనను వెంటనే గ్రహించాడు. "బంతి మెరిసే వైపు రెండు పెద్ద స్పైక్‌లు " అని పాంటింగ్ చెప్పాడు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ కార్స్ బాల్ టాంపరింగ్ చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఇండియా రెండో ఇన్నింగ్స్ 12 ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్స్ కావాలనే వికెట్ కోసం బాల్ టాంపరింగ్ చేశాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మెరుపు ఉన్న భాగాన్ని తొలగిస్తే బంతి రివర్స్ స్వింగ్ అవుతుంది. దీంతో బంతిని ఒక వైపు రఫ్ చేసి రివర్స్ స్వింగ్ రాబట్టడానికి కార్స్ ఈ పని చేసి ఉంటాడని ఈ ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ ను విమర్శిస్తున్నారు.
ఈ మ్యాచ్ లో కార్స్ రెండు ఇన్నింగ్స్ ల్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో 21 ఓవర్లు.. రెండో ఇన్నింగ్స్ లో 17 ఓవర్ల వేసినా వికెట్ తీయడంలో విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత బ్యాటింగ్ ధాటికి ఇంగ్లాండ్ బౌలర్లు కుదేలయ్యారు. టెస్ట్ మ్యాచ్ చివరి 5 సెషన్స్ లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీయగలిగారు. దీంతో నాలుగో టెస్ట్ డ్రా అయింది. వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 358 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 669 పరుగుల భారీ స్కోర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది.
Brydon Carse was caught on camera deliberately stepping on the ball with spikes during the Manchester Test on day 4.
— ̶S̶̶A̶̶N̶̶J̶̶A̶̶Y̶ (@sanjayJaat69) July 27, 2025
Isn't this ball tampering? 😲 pic.twitter.com/oPwbkmLUL4