OMG : ఈ పెట్రోల్, డీజిల్ కార్లు వాడితే రూ.20 వేల ఫైన్

OMG : ఈ పెట్రోల్, డీజిల్ కార్లు వాడితే రూ.20 వేల ఫైన్

నగరంలో వాయుకాలుష్యం తీవ్రమవుతున్న దృష్ట్యా తదుపరి నోటీసు వచ్చేవరకు BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లను నడపడంపై నిషేధం విధించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ వీధుల్లో అలాంటి వాహనాలు నడుస్తున్నట్లు గుర్తించినట్లయితే, రూ. 20వేల జరిమానా వసూలు చేయవచ్చు.

ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక 'ప్రమాదకర' స్థాయికి చేరుకోవడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) ఫేజ్ 3 కింద ఉన్న చర్యలను అమలు చేశారు. ముండ్కాలో, AQI నవంబర్ 2న గరిష్టంగా 835కి చేరుకుంది. ఇతర ప్రాంతాలలో కూడా AQI 700, 600 కంటే ఎక్కువగా నమోదైంది.

పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలను రాబోయే రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నవంబర్ 2న ప్రకటించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో అన్ని అనవసరమైన నిర్మాణ పనులను నిషేధించింది. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి దేశ రాజధానిలోకి డీజిల్ ట్రక్కుల ప్రవేశాన్ని పరిమితం చేసింది.