పొరబాటున సరిహద్దు దాటాడు: తిప్పి పాక్ కు అప్పగించిన ఆర్మీ

పొరబాటున సరిహద్దు దాటాడు: తిప్పి పాక్ కు అప్పగించిన ఆర్మీ

ఎంతగా ఉద్రిక్తతలు ఉన్నా… పాక్ ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా.. సాధారణ పౌరుల విషయంలో శాంతి సామరస్యాలకే భారత ఆర్మీ ముందుంటుందని నిరూపించింది. ఉగ్రవాదం పైనే పోరాటం కానీ.. పాకిస్థాన్ ప్రజలపై కాదని ప్రపంచానికి చాటింది.

పాక్ నుంచి ఓ పౌరుడు పొరబాటున సరిహద్దు దాటితే.. క్షేమంగా తిప్పి పంపింది భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్). కశ్మీర్ లోని సాంబా జిల్లా రామ్ గఢ్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు గుండా శుక్రవారం ఓ పాకిస్థాన్ పౌరుడు.. భారత్ లోకి వచ్చాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించిన బీఎస్ఎఫ్.. పొరబాటున సరిహద్దు దాటిన పాకిస్థానీగా నిర్థారించుకుంది. శాంతి సామరస్యాలకు సూచికగా అతడిని శనివారం మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో తిప్పి పాక్ రేంజర్లకు అప్పగించారు బీఎస్ఎఫ్ జవాన్లు.