
- బీఎస్ఎఫ్ సిబ్బంది సెలవులు రద్దు
న్యూఢిల్లీ: రిజర్వేషన్ల అంశంపై పొరుగుదేశం బంగ్లాదేశ్ లో నేలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత సైన్యం అప్రమత్తమైంది. 4,096 కిలోమీటర్ల మేర ఉన్న భారత్– బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) హైఅలర్ట్ ప్రకటించింది. అదనపు బలగాలతో పాటు కమాండర్లందరూ బార్డర్లోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. సిబ్బందికి సెలవులు కూడా రద్దు చేశారు.
పరిస్థితులను సమీక్షించేందుకు బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తల నేపథ్యంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు పోలీసులు భద్రత పెంచారు. కోల్‌కతా, -ఢాకా మధ్య నడిచే -మైత్రీ ఎక్స్‌ప్రెస్ సర్వీసును సోమవారం, మంగళవారం రద్దు చేస్తున్నట్లు ఇండియన్ రైల్వే ప్రకటించింది.