U-19 Asia Cup: అండర్-19 ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా CSK చిచ్చర పిడుగు

U-19 Asia Cup: అండర్-19 ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా CSK చిచ్చర పిడుగు

అండర్-19 ఆసియా కప్ కు భారత స్క్వాడ్ వచ్చేసింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ టీమిండియా  శుక్రవారం (నవంబర్ 28) ప్రకటించింది. డిసెంబర్ 12న దుబాయ్‌లో ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్ లో భారత కెప్టెన్ గా 18 ఏళ్ల ముంబై బ్యాటర్ ఆయుష్ మాత్రే ఎంపికయ్యాడు. విహాన్ మల్హోత్రానికి వైస్ కెప్టెన్సీ అప్పగించారు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లో జరుగుతున్న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో బీహార్ తరపున ఆడుతున్న 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి కూడా స్క్వాడ్ లో స్థానం సంపాదించాడు. 

కిషన్ కుమార్ సింగ్ కూడా జట్టులో ఉన్నాడు. అయితే కిషన్ ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదు. ఎనిమిది జట్లు ఆడుతున్న ఈ టోర్నీలో బీసీసీఐ సెలక్టర్లు రాహుల్ కుమార్, హేమచుదేశన్ జె, బికె కిషోర్, ఆదిత్య రావత్ లను స్టాండ్‌బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు. గ్రూప్ ఏ లో  ఇండియా, పాకిస్థాన్ ఉన్నాయి. ఈ గ్రూప్ లోని మిగిలిన రెండు జట్లు క్వాలిఫయర్స్ ద్వారా ఎంపిక కాబడతాయి. 

బహ్రెయిన్, హాంకాంగ్, ఇరాన్, జపాన్, కువైట్, మలేషియా, మాల్దీవులు, నేపాల్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, థాయిలాండ్, యుఎఇ (మొత్తం 14 జట్లు) క్వాలిఫయర్స్‌లో ఆడుతున్నాయి. ఫైనల్ కు వెళ్లిన రెండు జట్లతో పాటు మూడో స్థానంలో నిలిచిన జట్టు ఆసియా కప్ కు అర్హత సాధిస్తుంది. 

ALSO READ : చీకు(కోహ్లీ)ను హోటల్‌లో దింపిన మహి..

గ్రూప్ ఎ:  ఇండియా, పాకిస్తాన్, క్వాలిఫయర్ 1, క్వాలిఫయర్ 3

గ్రూప్ బి:  బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, క్వాలిఫయర్ 2

ఆసియా కప్ కు భారత అండర్ 19 జట్టు:

ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, నమన్ పుష్పక్, దీపేష్, హనీల్ పటేల్, ఉద్ధవ్ మోహన్, ఆరోన్ జోర్జ్, కిషన్ కుమార్ సింగ్ 

స్టాండ్‌బై ప్లేయర్స్: రాహుల్ కుమార్, హేమచుదేశన్ జె, బికె కిషోర్, ఆదిత్య రావత్