ఇద్దరూ స్టార్ క్రికెటర్లు.. పైగా మంచి స్నేహితులు..వారి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వారెవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ.. వీరిద్దరికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ కి కనువిందు చేస్తోంది.. చిరకాల మిత్రుడికి గ్రాండ్ పార్టీ ఇచ్చి, స్వయంగా హోటల్ దాకా సాగనంపి ఎప్పటికీ గుర్తుండి పోయేలా వీడ్కోలు పలికిన ధోని సింప్లిసిటీకి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా వన్డేలో ఆడేందుకు వచ్చిన టీం ఇండియాకు తన ఇంట్లో పార్టీ ఇచ్చిన స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ.. పార్టీ అనంతరం ధోని స్వయంగా కారు నడుపుతూ విరాట్ కోహ్లీని హోటల్ కు డ్రాప్ చేయడం, దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఆదివారం జరిగే IND vs SA ODI సిరీస్‌కు ముందు ధోని భారత క్రికెట్ జట్టుకు విందు ఇచ్చాడు.. రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ ,ఇతర జట్టు సభ్యులు భారత మాజీ కెప్టెన్ ఇంట్లో ఎంజాయ్ చేశారు. అయితే ధోని కోహ్లీతో కలిసి కారు నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో అందరిని ఆకట్టుకుంటోంది. Xలో అభిమానులు విపరీతంగా షేర్ చేసిన ఈ క్లిప్..ధోని తన SUV కారులో కోహ్లీని పక్కన కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తున్నట్లు చూపిస్తుంది. స్వయంగా కారు నడుపుతూ ధోని, విరాట్ ను హోటల్ కు డ్రాప్ చేశాడు. ఇది అరుదైన లోతైన నోస్టాల్జిక్ సీన్ అని ఫ్యాన్స్ ఎమోషనల్ రీట్వీట్స్ తో కామెంట్ బాక్స్ నింపారు.
రెండవ బిడ్డ పుట్టిన తర్వాత లండన్‌కు వెళ్లిన కోహ్లీ.. ఇండియా, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ఆడేందుకు ఈ వారం ప్రారంభంలో భారత్ కు వచ్చాడు. కోహ్లీ చివరిసారిగా అక్టోబర్ 25న సిడ్నీలో భారత్ తరపున ఆడాడు.అజేయంగా 74 పరుగులు చేసి ఆస్ట్రేలియాపై భారత్ వైట్‌వాష్ నుంచి తప్పించాడు. 36 ఏళ్ల అతను తన కెరీర్‌ను 2027 ప్రపంచ కప్ వరకు పొడిగించుకోవాలని ఆసక్తిగా ఉన్నాడు కోహ్లీ. ప్రతి సిరీస్ కోహ్లీ ఫిట్‌నెస్, ఫామ్‌ను ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాడు కోహ్లీ.
ALSO READ : సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌పై రిషబ్ పంత్ కీలక వ్యాఖ్యలు
రాంచీలో కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. కోహ్లీ 5 సిరీస్ లలో రెండు వన్డే సెంచరీలు ,మరో అర్ధ సెంచరీని సాధించాడు. రాంచీ వేదికపై 192 సగటుతో 109.40 పరుగులు సాధించి అద్భుతమైన ఆట తీరు ప్రదర్వించాడు. 2019 తర్వాత ఈ వేదికపై కోహ్లీ కనిపించడం ఇదే మొదటిసారి.
Reunion of the year? 🥺#INDvSA 1st ODI | SUN, 30 NOV, 12:30 PM pic.twitter.com/wu2qSTn30i
— Star Sports (@StarSportsIndia) November 27, 2025
