ఈరోజుల్లో ఏ ఇల్లు చూసినా ఎలక్ట్రికల్ ఐటమ్స్ తో నిండిపోయి ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషిన్ లు వంటివి తప్పనిసరి అయిపోయాయి.వీటిని వాడటం వల్ల సౌకర్యం ఉన్నప్పటికీ అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇళ్లలో ఫ్రిడ్జిలు, టీవీలు, ఏసీలు పేలిన ఘటనలు గురించి వినే ఉంటారు కానీ.. వాషింగ్ మెషిన్ పేలిన ఘటనలు చాలా రేర్ అని చెప్పాలి. హైదరాబాద్ అమీర్ పేట్ లోని ఓ ఇంట్లో వాషింగ్ మెషిన్ పేలి పీస్ పీస్ అయిపోయింది. గురువారం ( నవంబర్ 27 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
అమీర్ పేట్ లోని ఓ ఇంట్లో వాషింగ్ మెషిన్ పేలింది.. పెద్ద శబ్దంతో పేలిన వాషింగ్ మెషిన్ తునాతునకలైపోయింది. పేలుడు సమయంలో ఇంట్లో ఉన్నవాళ్లు ఎవరు వాషింగ్ మెషిన్ దగ్గర లేకపోవడంతో భారీ ముప్పు తప్పింది. వాషింగ్ మెషిన్ రన్నింగ్ లో ఉండగా.. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలడంతో ఇంట్లోనివారంతా భయబ్రాంతులకు గురయ్యారు.
ఇవాళ మధ్యాహ్నం వాషింగ్ మెషిన్ రన్నింగ్ లో ఉండగా పేలిందని.. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అంతా బయపడ్డామని తెలిపారు బాధితురాలు. పేలుడు జరిగిన సమయంలో లక్కీగా బాల్కనీలో ఎవరూ లేమని.. ఉండుంటే పెద్ద ప్రమాదం జరిగేదని తెలిపారు బాధితురాలు. పేలుడు ధాటికి వాషింగ్ మెషిన్ లోపల పార్ట్స్ ఎగిరిపడ్డాయని.. సీలింగ్ తగిలి కింద పడ్డాయని తెలిపారు బాధితురాలు.
వాషింగ్ మెషిన్ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మెషిన్ తయారీలో లోపమా లేక మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల పేలిందా అన్నది తెలియాలి. ఈ ఘటనతో ప్రాణనష్టమేమీ సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
