
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దేశ రక్షణలో ఉన్న భద్రతా బలగాల్లోనూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో అత్యధికంగా 406 మంది వైరస్ బారినపడ్డారు. గడిచిన 24 గంటల్లోనే 21 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే మొత్తం కరోనా బారినపడిన వారిలో ఇప్పటి వరకు 286 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా.. మరో 120 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు.
BSF records 21 new positive cases of #COVID19 in last 24 hours. All of them are under treatment in designated COVID-19 health care hospitals. Till date 286 recovered and discharged from hospitals. Active cases as on today 120: Border Security Force (BSF)
— ANI (@ANI) May 23, 2020
సీఆర్పీఎఫ్ లో 350కి చేరిన కరోనా కేసులు
సీఆర్పీఎఫ్ జవాన్లలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 350కి చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఆరుగురికి వైరస్ సోకిందని సీఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కరోనా బారినపడిన జవాన్లలో 219 మంది డిశ్చార్జ్ కాగా, ఇద్దరు మరణించారని చెప్పారు. ప్రస్తుతం 129 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. ఇక ఐటీబీపీలో ఇవాళ కొత్త కేసులేమీ నమోదు కాదని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు 187 మంది ఐటీబీపీ జవాన్లకు వైరస్ సోకగా.. వారిలో 94 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, మరో 93 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని చెప్పారు.
6 new cases of #COVID19 have been reported in Central Reserve Police Force today, taking total number of cases to 350 & fatalities to two in the force. There are 129 active cases now: CRPF pic.twitter.com/k60Lf6scTU
— ANI (@ANI) May 23, 2020