ఆ ప్రొవిజన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొలగించండి : మాయావతి

ఆ ప్రొవిజన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తొలగించండి : మాయావతి
  •     రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి: మాయావతి

లక్నో : మహిళా రిజర్వేషన్ల బిల్లును తమ రాజకీయ లబ్ధి కోసం బీజేపీ, కాంగ్రెస్ ఉపయోగించుకుంటున్నాయని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. జనాభా లెక్కింపు, నియోజకవర్గాల పునర్విభజన వంటి ప్రొవిజన్లను బిల్లు నుంచి తీసేయాలని, వీటి వల్ల రిజర్వేషన్లు ఆలస్యం అవుతున్నాయని ఆరోపించారు. ఆయా ప్రొవిజన్లను తొలగించి.. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని ఎన్నికల దాకా, 15 లేదా 16 ఏండ్ల వరకు రిజర్వేషన్ల లబ్ధి మహిళలకు అందకుండా.. బిల్లులులోని ప్రొవిజన్లను పొందుపరిచారని ఆరోపించారు. 

సమానంగా గౌరవించండి : కనిమొళి

మహిళా బిల్లు కేవలం రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించినది కాదని, పక్షపాత వైఖరిని, అన్యాయాన్ని తొలగించే చర్య అని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. మహిళలను సమానంగా గౌరవించాలని కోరారు. . ‘‘బిల్లు అమలు కోసం మేం ఎంత కాలం ఎదురుచూడాలి. వచ్చే పార్లమెంటరీ ఎన్నికల్లోనే రిజర్వేషన్లను సులభంగా అమలు చేయవచ్చు. బిల్లును ‘నారీ శక్తి వందన్ అధినియం’ అని పిలుస్తున్నారు. మాకు సెల్యూట్ చేయడం ఆపండి.. మాకు సెల్యూట్లు అవసరం లేదు. మాకేమీ పీఠాలు అవసరం లేదు. మమ్మల్ని పూజించాల్సిన పని లేదు. సమానంగా గౌరవించడం మాత్రమే మాకు కావాలి” అని చెప్పారు.