గురుకులాలు ఎందుకు ఓపెన్ చేయ‌డం లేదు

V6 Velugu Posted on Oct 18, 2021

తెలంగాణ ప్రభుత్వం గురుకుల విద్యార్థులను కూలీలుగా మార్చేలా వ్యవహరిస్తోందని విమర్శించారు మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ర్టంలో ప్రభుత్వ,ప్రయివేట్ విద్యా సంస్థలను రీ ఓపెన్ చేసినా. రెసిడెన్షియ‌ల్స్ విషయంలో స‌ర్కారు ఇంకా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. లక్షలాది పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలు, హాస్టళ్ల పునఃప్రారంభంపై కేసీఆర్ మౌనం ఒక తరాన్ని కూలీలుగా మార్చే కుట్ర అని అన్నారు ప్రవీణ్ కుమార్.

ఇలాంటి వైఖరితో పిల్లలు భూస్వాముల ఇళ్లు, భూముల్లో కూలీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గడీల పాలన నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేయాలంటూ ట్విట్టర్‌ వేదికగా ట్వీట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

Tagged open, RS Praveen, BSP leader, gurukuls

Latest Videos

Subscribe Now

More News