మాయావతిపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలు.. బీఎస్పీ నేతల ఫిర్యాదు

మాయావతిపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలు.. బీఎస్పీ నేతల ఫిర్యాదు

బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతిపై ప్రముఖ  ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో ఆయనపై తెలుగు రాష్ట్రాల్లో బీఎస్పీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారు. లేటెస్ట్ గా గరికపాటిపై చర్యలు తీసుకోవాలంటూ ఉప్పల్ నియోజకవర్గ బీఎస్పీ ఇంచార్జ్ శివ ఉల్కుందకార్ ఆధ్వర్యంలో బీఎస్పీ నాయకులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చారు. మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు, మాహిళల పట్ల హేళనగా మాట్లాడి వారిని కించపరిచినందుకు గరికపాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  ఫిర్యాదులో పేర్కొన్నారు. 

దేశంలో మహిళల అభివృద్ధి విషయంలో మాట్లాడిన గరికపాటి నరసింహారావు..అవినీతిలోనూ మహిళలు ముందే ఉన్నారని వ్యాఖ్యానించారు. యూపీ మాజీ సీఎం మాయావతిని ఉదాహరణగా మాట్లాడిన ఆయన...మాయావతి రూ. 550 కోట్ల అవినీతి చేశారని ఆరోపించారు. యూపీలో ఆమె పార్టీ గుర్తు ఏనుగు బొమ్మలు, మాయావతి విగ్రహాలను భారీగా తయారు చేయించారని ..రెండు బొమ్మలు అవసరం లేదని....మాయావతి ఆకారంపై  అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.