
టీఎస్పీఎస్సీ(TSPSC ) పేపర్ లీకేజీ పెద్ద స్కాం.. దీన్ని చిన్న విషయంగా మార్చుతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కూమార్(RS Praveen Kumar) ఆరోపించారు. మార్చి 21 మంగళవారం పేపర్ లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్ లో యువజన సమితి ఆధ్వర్యంలో నిరుద్యోగుల గోస పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కూమార్ పాల్గొన్నారు. ప్రశ్నించే చానల్స్ ను బ్యాన్ చేస్తమని బీఆర్ఎస్ మంత్రులు బెదిరిస్తున్నారు. ఇలాంటి అన్ని సమస్యలపై కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని వెల్లడించారు ప్రవీణ్ కుమార్. ప్రత్యేక కార్యాచరణతో అందరం ప్రజల్లోకి వెళ్లాలన్నారు.
రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి.. ప్రత్యేక విమానాల్లో పోయి కవితను కాపాడుకునేంత దమ్ము వారికి ఉందని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పినట్లు సిట్ వింటుంది. పేపర్ లీక్ కేసును సిట్ కాదు సీబీఐతోనే విచారించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కొందిరి చేతుల్లోబలైందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.