ప్రజల మధ్య చిచ్చుకు రాజకీయ నాయకులే కారణం

ప్రజల మధ్య చిచ్చుకు రాజకీయ నాయకులే కారణం

అంబేద్కర్ పేరుతో రాజకీయాలు చేయడం దుర్మార్గమని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ లోని కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా అక్కడి ప్రభుత్వం పేరు మార్చింది. దీంతో జిల్లా పేరు మార్చొద్దంటూ అక్కడి ప్రజలు రోడ్డెక్కారు. ఇప్పుడు ఈ విషయంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడం తెలుగు  ప్రజలకు గర్వకారణమన్నారు. అంబేద్కర్ చాలా గొప్ప వ్యక్తి అని, అలాంటి వ్యక్తి పేరు మీద జిల్లాను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అయితే అంబేద్కర్ పేరు ముందే పెడితే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ ను కేవలం ఆయన జయంతి, వర్థంతి రోజుల్లో గుర్తు చేసుకోవడం తప్ప... నేటి నాయకులు చేసిందేమీ లేదన్నారు.

రాజ్యాధికారంలో ప్రతి ఒక్కరికి వాటా దక్కాలన్న అంబేద్కర్ మాటలను ఆచరించాలని సూచించారు. పేద ప్రజలకు తాయిలాలు ప్రకటించి ఓట్లు దండుకోవడం పక్కన పెట్టి... వారి అభివృద్ధికి పార్టీలు కృషి చేయాలని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు ప్రతి రంగంలో వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేశారు. బీఎస్పీ అందుకోసమే పని చేస్తోందని తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం...

పోడు సాగుదారులపై దాడుల్ని వెంటనే ఆపాలి

హింసకు పాల్పడిన వారిని ఉపేక్షించేదిలేదు