ప్రభుత్వ పనితీరు బాగాలేకనే మంత్రి మల్లారెడ్డిపై దాడి

ప్రభుత్వ పనితీరు బాగాలేకనే మంత్రి మల్లారెడ్డిపై దాడి
  • బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మహబూబాబాద్ జిల్లా: టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు బాగాలేకనే నిన్న మంత్రి మల్లా రెడ్డి పైన ప్రజలు దాడి చేశారని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఛీఫ్ కో ఆర్డినేటర్ డా.ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఇవాళ 78వ రోజు బయ్యారం, గార్ల మండలాల్లో   పర్యటించారు. కాలనీల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బయ్యారం ఐరన్ ఓవర్ పెద్ద గుట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా బయ్యారంలో ఆయన మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి దాడి ఘటనను ప్రస్తావించారు. 
బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి
బయ్యారం ఐరన్ ఫ్యాక్టరీపై టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు నాటకాలు అడుతున్నాయని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే వేలాది మందికి ఉపాధి కలుగుతుందన్నారు. రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి కేటీఆర్ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఎందుకు నోరు విప్పరని ఆయన ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో గనులు తవ్వకుండా ప్రార్థనా మందిరాలను తవ్వుతాం అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.  రాష్ట్రంలో నాలుగు నెలల నుండి ఫించన్లు రావటం లేదని,  ఉద్యోగస్థులు కూడా సమయానికి  జీతాలు రావటం లేదని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దింపాలని ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. 

 

ఇవి కూడా చదవండి

జనం కొట్టేరోజులు దగ్గరలోనే ఉన్నయ్

 

వారంలో రాష్ట్రానికి రుతుపవనాలు

సిటీలో క్రమంగా పెరుగుతున్న సైకిళ్ల వాడకం