లింగంపేట, వెలుగు: మండలంలోని బాయంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బాయంపల్లి తండాకు చెందిన మెగావత్ సంతోష్ తన సమీప అభ్యర్థి కుంట ఎల్లయ్యపై 2 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. సంతోష్ బీటెక్ (మెకానికల్ ఇంజినీర్) పూర్తి చేసి ఇంటివద్ద వ్యవసాయం చేస్తున్నాడు. పంచాయతీ స్థానం జనరల్ రిజర్వు కావడంతో బరిలో నిలువగా 198 ఓట్లు వచ్చాయి. సమీప అభ్యర్థి కుంట ఎల్లయ్యకు 196 ఓట్లు వచ్చాయి. మిగతా 5 ఓట్లు చెల్లకుండా పోయాయి. కేవలం 2ఓట్ల తేడాతో గొలుపొందడంపై మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
