హైదరాబాద్‎లో బుల్లెట్ బైక్‎పై నుంచి కిందపడి బీటెక్ విద్యార్థిని మృతి

హైదరాబాద్‎లో బుల్లెట్ బైక్‎పై నుంచి కిందపడి బీటెక్ విద్యార్థిని మృతి

హైదరాబాద్: బైక్ స్కిడ్ కావడంతో కిందపడి బీటెక్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని నారపల్లి దగ్గర చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సిరిసిల్లకి చెందిన హాసిని (18) యమ్నంపేటలోని ఓ ప్రైవేట్ హాస్టల్ ఉంటూ శ్రీనిధి కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సోమవారం (డిసెంబర్ 8) భువనగిరికి చెందిన తన ఫ్రెండ్ అక్షయ్ (18)తో కలిసి బుల్లెట్ బైక్‎పై ఉప్పల్ నుంచి ఘట్‎కేసర్ వైపు వెళ్తోంది.

 ఈ క్రమంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపల్లి సమీపంలో బైక్ స్కిడ్ అవ్వడంతో కిందపడ్డ హాసిని అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న అక్షయ్ తీవ్రంగా గాయపడటంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుడు అక్షయ్ ఉప్పల్‎లోని లిటిల్ ఫ్లవర్ కళాశాలలో చదువుతున్నాడు.