గులాబీ రంగులో నిగనిగలాడుతోంది కదా. దాని ఒంపులు, సొంపులు ఆకర్షించేస్తున్నాయి కదా. దానికి తగ్గట్టే ఈ ఒంపు సొంపుల గులాబీ వజ్రానికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఇది బబుల్గమ్ డైమండ్. అలా అని బబుల్గమ్తో తయారు చేశారనుకుంటే పొరపాటే. జస్ట్ బబుల్గమ్ ఆకారంలో తయారు చేశారంతే. ప్రముఖ అంతర్జాతీయ వేలం సంస్థ క్రిస్టీ హాంకాంగ్ బ్రాంచ్ క్రిస్టీ ఆసియా ఈ డైమండ్‌ను మే 28న వేలం వేసింది. పాడుకున్న వ్యక్తి ఎవరో తెలియదుగానీ 75 లక్షల డాలర్లు (సుమారు రూ.52 కోట్లు) పెట్టి సొంతం చేసుకున్నాడు. పింక్ డైమండ్లలో బహుశా ఈ బబుల్గమ్ డైమండే చాలా గట్టిదై ఉంటుందని, 50 ఏళ్ల తన అనుభవంలో ఇంత గట్టి డైమండ్‌ను చూడలేదని క్రిస్టీ డైమండ్స్ స్పెషలిస్ట్ ఫ్రాన్సిస్ చెప్పాడు.
