న్యాయం కోసం కశ్మీరీ పండిట్ల ఆందోళన

న్యాయం కోసం కశ్మీరీ పండిట్ల ఆందోళన

ఉగ్రవాదుల నుంచి తమను రక్షించడంలో.. కేంద్ర ప్రభుత్వం విఫలమైందని... కశ్మీరీ పండిట్లు ఆందోళనకు దిగారు. బుద్గామ్ జిల్లాలో కశ్మీర్ పండిట్ ను ఉగ్రవాదులు హత్య చేశారు. రాహుల్ హత్యకు నిరసనగా పెద్ద ఎత్తున కశ్మీర్ పండిట్లు నిరసనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ... జమ్ము కశ్మీర్ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. కశ్మీర్ వ్యాలీలో నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, కశ్మీరీ పండిట్ల కుటుంబాలు బుద్గామ్ లో ఎల్ జీ కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. బుద్గామ్ లోని ఎయిర్ పోర్టు వైపు వెళ్లకుండా నిరసనకారులపై టియర్ గ్యాస్ వాడారు. లాఠీ ఛార్జ్ లు చేసి, టియర్ గ్యాస్ వాడితే.. ఉగ్రవాదిని పట్టులేరు కదా అని విమర్శలు గుప్పించారు నిరసనకారులు. ఉగ్రవాదిని హతమార్చాలని డిమాండ్ చేశారు.

చదూరకు చెందిన రాహుల్ భట్ అనే 36 ఏళ్ల కశ్మీర్ పండిట్ ను తహశీల్దార్ కార్యాలయం దగ్గరే హత్య చేశారు. ఆఫీసు లోనికి ఈడ్చుకెళ్లి తుపాకీతో కాల్పులు జరిపి వదిలేసి పోయారు. తీవ్రగాయాలతో ఉన్న రాహుల్ ను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. రాహుల్ భట్ తహశీల్దార్ కార్యాలయంలో క్లర్క్ గా పనిచేస్తున్నారు. కశ్మీరీ పండిట్ల కోసం ప్రధానమంత్రి ప్యాకేజ్ పథకం కోసం పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం

ఆ విషయంలో కల్వకుంట్ల వారికి అస్కార్ ఇవ్వొచ్చు

కాంగ్రెస్ పార్టీ మేథోమధనం..హాజరైన రేవంత్, భట్టి