కాంగ్రెస్ పార్టీ మేథోమధనం..హాజరైన రేవంత్, భట్టి

కాంగ్రెస్ పార్టీ మేథోమధనం..హాజరైన రేవంత్, భట్టి

 

  • రాజస్థాన్ ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శివిర్
  • మూడు రోజుల పాటు జరగనున్న చింతన్ శివిర్ సమావేశాలు
  • తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ సహా పలువురు హాజరు
  • భవిష్యత్ వ్యూహాలు, ప్రజా సమస్యలు, కార్యాచరణ పై చర్చ

దేశవ్యాప్తంగా దీనావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మేథోమధనం నిర్వహిస్తుంది. కాంగ్రె రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ నవ సంకల్ప్ చింతన్ శివిర్ కొనసాగుతుంది. మూడురోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా 430 మంది ప్రధాన నేతలు పాల్గొన్నారు. ఇక ఈ సమావేశాలకు తెలంగాణ నుండి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ బోసు రాజు, ఏఐసీసీ సెక్రెటరీలు చిన్నారెడ్డి, సంపత్, వంశీ చందర్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బెల్లయ్య నాయక్ పాల్గొన్నారు. కోమటిరెడ్డికి ఆహ్వానం ఉన్నా ఆయన యూరప్ ట్రిప్ లో ఉండడం వల్ల సమావేశాలకు హాజరుకాలేదు. రేపు లేదా ఎల్లుండి ఆయన చింతన్ శివర్ కు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

పార్టీ పదవులు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు వయస్సు పరిమితిని విధించే అంశం, 2024 లోక్ సభ ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేయడం యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వివిధ పార్టీలతో పొత్తల వంటి కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సభ్యత్వాల నమోదు ప్రక్రియ విస్తృతంగా చేపడుతున్నారు. ఆ తర్వాత పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ ఉంటుందని ఇదివరకే పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. 

ఈ సదస్సులో వివిధ అంశాలపై 430 మంది ప్రతినిధులు ఆరు బృందాలుగా మారి చర్చించిస్తున్నారు. రెండ్రోజుల పాటు ఈ చర్చలు కొనసాగాక మూడో రోజున డిక్లరేషన్ ను ప్రవేశపెట్టనున్నారు. మూడో రోజు జరిగే సీడబ్ల్యూసీ భేటీలో డిక్లరేషన్ పై చర్చలు జరపనున్నారు. విస్తృత చర్చల తర్వాత నవ సంకల్ప తీర్మానంతో చింతన్ శివిర్ ముగియనుంది.