నిర్భయ ఫండ్ రూ. 200 కోట్లకు పెంపు

నిర్భయ ఫండ్ రూ. 200 కోట్లకు పెంపు

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్​లో హోం మినిస్ట్రీకి రూ. 1,85,776.55 కోట్లను ఆర్థిక మంత్రి నిర్మల కేటాయించారు. నిరుడు రూ.1,66,547 కోట్లు కేటాయించగా, ఈసారి 11.5 శాత నిధులు పెరిగాయి. నిరుడు పారామిలిటరీకి రూ. 87,444.06 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.81,396 కోట్లు అలకేట్ చేశారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఎన్ఎస్జీ, ఇతర సంస్థల నిర్వహణ ఖర్చు కింద ఈ ఫండ్స్ కేటాయించారు. ఇందులో సీఆర్పీఎఫ్​కు రూ.29,324.92 కోట్లు, బీఎస్ఎఫ్ కు రూ.22,718.45 కోట్లు, సీఐఎస్ఎఫ్​కు రూ.12,201.90 కోట్లు, ఎస్ఎస్బీకు రూ. 7,653.73 కోట్లు, ఐటీబీపీకి రూ.7,461.28 కోట్లు, అస్సాం రైఫిల్స్​కు రూ.6,658.41 కోట్లు, ఎన్ఎస్జీకి రూ.1,293.37 కోట్లు అలకేట్ చేశారు. దాదాపు అన్ని విభాగాలకూ ఈసారి ఫండ్స్ పెరిగాయి. నిరుడు జమ్మూకాశ్మీర్​కు రూ.34,704.46 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.35,581.44 కోట్లు ఇచ్చారు. లడఖ్ కు మాత్రం నిరుటి అంతే రూ.5,958 కోట్లు కేటాయించారు. 

జైళ్ల మోడ్రనైజేషన్​కు 400 కోట్లు

ఇంటెలిజెన్స్ బ్యూరోకు నిరుటి కన్నా 10% ఎక్కువగా రూ.3,168.36 కోట్లు అలకేట్ చేశారు. అలాగే నిర్భయ ఫండ్​కు నిరుటి కన్నా రెట్టింపుగా రూ.200 కోట్లు ఇచ్చారు. జైళ్ల మోడ్రనైజేషన్​కు రూ.400 కోట్లు ఇచ్చారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టంకు రూ.150 కోట్లు, విమెన్ హెల్ప్ డెస్క్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బ్యూరోకు రూ. 28 కోట్లు ఇచ్చారు. ఫోరెన్సిక్ విభాగం మోడ్రనైజేషన్​కు రూ.300 కోట్లు అలకేట్ చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధికి రూ.2,132.71 కోట్లు, బార్డర్ ఏరియాల డెవలప్​మెంట్​కు రూ.565.72 
కోట్లు కేటాయించారు.