- గ్రామాల్లో 2 కోట్లు, పట్టణాల్లో కోటి ఇండ్ల నిర్మాణం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్, అర్బన్ పథకాల కింద వచ్చే ఐదేండ్లలో పేదలకు 3 కోట్ల ఇండ్లను నిర్మిస్తామని కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతా ల్లో 2 కోట్ల ఇండ్లు, పట్టణ ప్రాంతాల్లో కోటి ఇండ్ల నిర్మాణాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నామని తెలిపారు. రూరల్‌లో ఇండ్ల నిర్మాణం కోసం కేంద్రం వాటాగా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.54,500 కోట్లు, అర్బన్‌కు రూ.2.2 లక్షల కోట్లు కేటాయిస్తామని తెలిపారు.
‘‘పీఎం ఆవాస్ యోజన 2.0 కింద కోటి పేద కుటుంబాలకు ఇండ్లు కట్టించాల్సిన అవస రం ఉంది. ఇందుకోసం మొత్తం రూ.10 లక్షల కోట్ల వ్యయం అవుతుంది. ఇందులో కేంద్రం నుంచి ఐదేండ్లలో రూ.2.2 లక్షల కోట్ల సాయం చేస్తాం” అని ఆమె వెల్లడించా రు. అలాగే గృహ నిర్మాణాలకు తీసుకునే రుణాలకు వడ్డీ రాయితీ ఇచ్చేందుకు కూడా కేంద్రం యోచిస్తోందన్నారు. రెంటల్ హౌ సింగ్ మార్కెట్లను ప్రోత్సహించేందుకు పాల సీలు, నిబంధనలను కూడా రూపొందిస్తామ ని కేంద్ర మంత్రి తెలిపారు. ఇండస్ట్రియల్ వర్కర్లకు డార్మిటరీ తరహా వసతి గృహాలను అందుబాటులోకి తేవడం కూడా ఇందులో ఉంటుందన్నారు.
