హల్వా తయారు చేసిన ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్

హల్వా  తయారు చేసిన ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్

మూడో సారి ఆర్థిక మంత్రిగా ఎన్నికైన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను అన్ని విధాలా సిద్ధంగా చేశారు. ఇక పార్లమెంట్కు సమర్పించడమే మిగిలింది. 2024 కేంద్ర బడ్జెట్ మరో ఐదు రోజుల్లో పార్లమెంట్ ముందుకు రానుంది. జూలై 22 న పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ సందర్భంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ పెద్ద హల్వా తయారు చేశారు. అదేంటీ ఇంత బిజీ టైంలో కూడా ఆమె హల్వా తయారు చేయడమేంటీ అనుకుంటున్నారు. దీని వెనక పెద్ద కథే ఉంది.. ఇది దశాబ్దాలుగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు జరిగే ఓ సాంప్రదాయ కార్యక్రమం హల్వా సెర్మనీ. మంగళవారం (జూలై 16) బడ్జెట్ తయారీ లాక్ ఇన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు జరిగే హల్వా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 

Also Read:-రైతన్నకు అవమానం.. షాపింగ్ మాల్లోకి ఎందుకు రానివ్వలేదో తెలుసా..?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ హల్వా తయారు చేశారు. పెద్ద ఇనుప వోక్ లో గరిటె తిప్పుతూ హల్వా  చేశారు. 2024-25 బడ్జెట్ ఫైనలైజ్ కార్యక్రమంలో భాగంగా ఆమె హల్వా సెర్మనీలో పాల్గొన్నారు. ఢిల్లీలోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్వార్టర్స్ లో జరిగిన ఈ కార్యకమ్రంలో నిర్మలా సీతారామన్ తోపాటు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి తోపాటు ఆర్థిక శాఖ సెక్రటీలు, సిబ్బంది పాల్గొన్నారు. 

హల్వా వేడుక అనేది దశాబ్దాలుగు వస్తున్న సాంప్రదాయం. హల్వా వేడుక అనేది బడ్జెట్ తయారీ లాక్ ఇన్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ఒక వారం ముందు జరిగే కార్యక్రమంం. ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రిత్వ శాఖ వంటగదిలో పెద్ద బ్యాచ్ హల్వా తయారు చేసే సాంప్రదాయం ఉంది. దీని ప్రకారమే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వాను తయారు చేశారు. బడ్జెట్ ప్రక్రియలో నేరుగా సంబంధం ఉన్న వారందరికి ఈ హల్వా అందజేస్తారు వేడుక ముగిసిన తర్వాత ఆర్థిక మంత్రి బడ్జెట్ ను సమర్పించే వరకు అధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖ లోనే ఉంటారు. 

మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభమై ఆగస్టు 12న ముగిస్తాయి. జూలై 23న బడ్జెట్ ను పార్లమెంట్ లో సమర్పించనున్నారు.